V6 News

మూసీ పునరుజ్జీవం పేరుతో ‘రియల్’ దందా.. ధర్నా చౌక్లో ప్రజా కమిటీ  సత్యాగ్రహ దీక్ష

మూసీ పునరుజ్జీవం పేరుతో ‘రియల్’ దందా.. ధర్నా చౌక్లో ప్రజా కమిటీ  సత్యాగ్రహ దీక్ష
  •      డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తున్నరు

 ముషీరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవం పేరిట రూ.వేల కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని ప్రజా కమిటీ ఆరోపించింది. బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో పర్యావరణ వేత్తలు సాగర్ ధార, లూబానా, ప్రొఫెసర్ వెంకట దాస్, పి. శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీపీఆర్ లేకుండానే భారీ నిర్మాణాలకు సన్నాహాలు చేయడం తగదన్నారు. మూసీలోకి కాలుష్యం రాకుండా అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం.. వేల కోట్లతో నదిని వ్యాపార వనరుగా మార్చుకుంటోందని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వకుండా, కేవలం జీవోలతో పేదల ఇండ్లను తొలగించడం అన్యాయమని ధ్వజమెత్తారు. మూసీ అంటే ప్రజల నది అని, అక్కడ రోడ్లు, భారీ భవనాల నిర్మాణాలు ఆపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.